ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణభీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

📰 Generate e-Paper Clip

భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

భీమారం(మంచిర్యాల):అర్జున్ సమాచారం, జూలై 21

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా భీమారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి, ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు,పరిధిలోని గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి,స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు.
5ఎస్ విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులకు,ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.రౌడీషీటర్లు,
సస్పెక్ట్ షీటర్లు, నేరస్తుల ఇళ్లను తరచూ తనిఖీ చేయడంతో పాటు వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.అలాగే, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి,ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!