మంచిర్యాల నియోజకవర్గం.
(అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు.4)
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో రాముని చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గారు ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారితో కలిసి పాల్గొని మొక్కలు నాటిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,మంచిర్యాల కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్,డీసీసీ జనరల్ సెక్రటరీ కల్వల జగన్ మోహన్ రావు ,49 Division President ఫాసి ఉల్లఖాన్ , నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

