ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్ఇల్లంతకుంట మండలం లో బీజేపీకి పార్టీ కి ఈటలకు భారీ షాక్.. బీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు సర్పంచ్‌లు...

ఇల్లంతకుంట మండలం లో బీజేపీకి పార్టీ కి ఈటలకు భారీ షాక్.. బీఆర్‌ఎస్‌లోకి ముగ్గురు సర్పంచ్‌లు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక

📰 Generate e-Paper Clip

హుజూరాబాద్,అర్జున్ సమాచారం:
ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నందినగర్ నివాసం లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  గంగుల కమలాకర్  ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  సమక్షంలో సిరిసేడు సర్పంచ్ కుమార్ -శ్యామల వంతడువుల సర్పంచ్ రాజేష్ -మాధవి టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల మనసుల్లో ఇప్పటికీ చెక్కుచెదరలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బీజేపీ కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలకే పరిమితమైందని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలనలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, గ్రామస్థాయిలో ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

కేసీఆర్ గారు మళ్లీ తెలంగాణకు నాయకత్వం వహించాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని సర్పంచ్‌లు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని, ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు.

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ బలం రోజురోజుకూ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో మాజీ SC కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాజీ MPP వెంకటేష్ పాల్గొన్నారు
===============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!