ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణఇరిగేషన్ శాఖలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా..ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి.

ఇరిగేషన్ శాఖలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా..ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి.

📰 Generate e-Paper Clip

ఇరిగేషన్ శాఖలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా..
ముఖ్య అతిథిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి.

అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

మంచిర్యాల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే ఆషాఢ బోనాల వేడుకలు ఇరిగేషన్ శాఖలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. టీఎన్జీవో మంచిర్యాల శాఖ అధ్యక్షులు నాగుల గోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ముఖ్య అతిథిగా, జిల్లా సహాధ్యక్షులు శ్రీపతి బాపురావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారిని భక్తి భావంతో ఆరాధించడం తెలంగాణ ప్రజల ఆచార సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. అమ్మవారి కరుణతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం గడియారం శ్రీహరిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా సంయుక్త కార్యదర్శి రోశయ్య, నిర్వహణ కార్యదర్శి మోసిన్, సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, అంజయ్య, జ్యోతి, అరుణ, ముత్తన్నతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!