29ట్రంప్‌కు షాక్.. విదేశీ విద్యార్థులకు కోర్టు ఊరట..
అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 17.
అమెరికా లో చదువుతున్న విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరటనిస్తూ అక్కడి ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల నివాస గడువు పరిమితికి సంబంధించి ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త నిబంధనను యూఎస్ ఫెడరల్ జడ్జి కొట్టివేశారు. ఎఫ్-1, జె-1, I వీసాలు ఉన్నవారికి నివాస కాలపరిమితిని భారీగా కుదిస్తూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2026లో నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి దీనిపై సెప్టెంబర్ 14నే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఈ నిబంధన ఏకపక్షంగా, సహేతుకత లోపం, అధికార దుర్వినియోగంతో ఉందని జడ్జి ఎఫ్ డెన్నిస్ స్లేయర్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు కల్పించడం అనేది కాంగ్రెస్ పని అని న్యాయమూర్తి వెల్లడించారు. దానిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ అడ్డుకోవడానికి యత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. F వీసాలున్న విదేశీ విద్యార్థులు, J వీసాలున్న విదేశీ పరిశోధకులు, ప్రొఫెసర్లు, I వీసాలున్న విదేశీ జర్నలిస్టులకు ఈ తీర్పుతో ఊరట లభించినట్లైంది. పాత నిబంధనల ప్రకారం ఎఫ్, జే వీసాలపై వచ్చే వారు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయిన తర్వాత కూడా నిబంధనలకు లోబడి అమెరికాలో ఉండే అవకాశం లభించేది. కానీ, కొత్త నిబంధనలతో విద్యార్థులు, ఎక్ఛ్సేంజ్ విజిటర్లకు 4 సంవత్సరాల గడువే ఇచ్చారు. పొడిగింపు అవసరమైతే మళ్లీ ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీ జర్నలిస్టులకు గతంలో 5 ఏళ్ల వరకు అవకాశం ఉండేది. దానిని 240 రోజులకు కుదిస్తూ ట్రంప్ సర్కారు నిబంధన తీసుకొచ్చింది. ఇక చైనా జర్నలిస్టులకు దీనిని 90 రోజులకే పరిమితం చేశారు.

