ePaper
Thursday, October 8, 2026
ePaper
Homeతెలంగాణరాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు,తోట చంద్రయ్యను పరామర్శించిన పుట్ట మధుకర్.

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు,తోట చంద్రయ్యను పరామర్శించిన పుట్ట మధుకర్.

📰 Generate e-Paper Clip

రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ పలకరింపు,తోట చంద్రయ్యను పరామర్శించిన పుట్ట మధుకర్.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 6 // రామగిరి రిపోర్టర్.

రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలకు విలువనిస్తూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆత్మీయతను చాటుకున్నారు. రామగిరి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పెద్దపల్లి జిల్లా స్థాయి పదవిలో ఉన్న తోట చంద్రయ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పుట్ట మధుకర్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రయ్య ఆరోగ్య పరిస్థితిని పుట్ట మధుకర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని, చంద్రయ్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

రాజకీయ భేదాలు పక్కనపెట్టి.. ఆత్మీయతకు ప్రాధాన్యం

తోట చంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, పుట్ట మధుకర్ రాజకీయంగా భిన్న పక్షానికి చెందినవారు. అయినప్పటికీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రయ్యను స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా రాజకీయ భేదాల కంటే మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.

చంద్రయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడిన పుట్ట మధుకర్.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పడంతో పాటు, అవసరమైన వైద్య సహాయం విషయంలో తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

తోట చంద్రయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాజీవితంలోకి రావాలని పుట్ట మధుకర్ ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ సందర్భంగా పరామర్శించిన పుట్ట మధుకర్‌కు చంద్రయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!