ePaper
Thursday, September 10, 2026
ePaper
Homeతెలంగాణలక్కారంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

లక్కారంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

📰 Generate e-Paper Clip

లక్కారంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

ముత్తారం: అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10.

మండలంలోని లక్కారం గ్రామంలో మాజీ ఎంపీపీ, స్థానిక సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అత్తే చంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో మాజీ చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి దిలీప్, ఉపసర్పంచ్ సల్లూరి రాజ్‌కుమార్, వార్డు సభ్యులు నరేష్, ప్రసాద్, కొమురయ్య, స్రవంతి, శ్రీకాంత్, కోమలత, సంపత్, స్వప్న, రవి, పద్మ, శంకర్, రాజాబాబు, గ్రామస్థులు సదానందం, రాజ్‌కుమార్, కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!