మందమర్రి.బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు జంగిలి రవీందర్ మరణం పట్టణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అర్జున్ సమాచారం సింగరేణిరే కోల్ బెల్ట్ ప్రతినిధి సెప్టెంబర్ 9 .
తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుత బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షులు జే రవీందర్ బుధవారం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి పట్టణంలోని ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది .మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుండి ఆ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమైందని చెప్పొచ్చు .అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను రవి పాల్గొన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మిక వర్గాన్ని ఉద్యమానికి సిద్ధం చేసిన ఉద్యమకారుల్లో ఈయన కూడా ప్రముఖంగానే పాల్గొన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి టి ఆర్ ఎస్ ఇప్పటి బి ఆర్ ఎస్ పార్టీలో ముఖ్య భూమిక పోషిస్తూ ప్రజలను ఐక్యం చేసే ప్రతి ఉద్యమ కార్యాచరణలోను రవి పాల్గొన్నారు .బి ఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం ( టీ బీ జీ.కే ఎస్) గెలుపులోను ఆ యూనియన్ లో ఏర్పడిన అంతర్గత కలహాలలోను ఆయన ప్రముఖంగానే బాధ్యతను తన భుజస్కాంతాలపై వేసుకొని విచ్చిన్నం కాకుండా సంఘాన్ని కాపాడడంలోనూ ముఖ్యభూమికనే పోషించారు. అలాంటి రవి ఈనాడు భౌతికంగా లేకపోయినా ఆయన ఇక్కడ చిన్నల నుండి మొదలుకొని పెద్దల వరకు సుపరిచితుడు గానే చెప్పుకోవచ్చు ,అందరినీ కలుపుగోలుగా పలకరిస్తూ చిన్నవాళ్లను తమ్ముడు చెల్లి అంటూ పెద్దవాళ్లను అక్క అన్న అని సంబోధిస్తూ అందరి మన్ననలను అందుకున్న రవి ఈ విధంగా ప్రజలకు దూరం అవడం అందరిలోనూ ఒక బాధను మిగిల్చిందనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో ,ఆయన భౌతిక కాయం బుధవారం మందమర్రి కి చేరుకున్న తర్వాత గురువారం ఉదయం 10 గంటలకు మూడవ జోన్ లోని వారి ఇంటి నుండి ఆయన శవయాత్ర ప్రారంభమవుతుందని బి ఆర్ ఎస్ పట్టణ నాయకత్వం ప్రకటించింది అందరూ ఈ కార్యక్రమానికి మహిళలు విద్యార్థులు కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు అన్ని వర్గాల శ్రామికులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పట్టణ కమిటీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది కనుక ఆయన సన్నిహితులు ఉద్యమకారులు శ్రేయోభిలాషులు అందరూ విషయాన్ని గమనించి ఈ దహన సంస్కారాల్లో పాల్గొనాల్సిందిగా పట్టణ బి ఆర్ ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది.

