ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు .సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు...

ఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు .సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు తీసుకోవాలని ఏ ఐ ఎస్ బి డిమాండ్

📰 Generate e-Paper Clip

ఆశ్రమ పాఠశాల అక్రమాలపై జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు .సంక్షేమ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలకు తీసుకోవాలని ఏ ఐ ఎస్ బి డిమాండ్*

అర్జున్ సమాచారం అక్టోబర్ 3 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రేగులగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పౌష్టికాహార బియ్యం మరియు నిత్యావసర సరుకుల అక్రమ తరలింపుపై, అలాగే ఇదివరకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐ ఎస్ బి ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్ మాట్లాడుతూ.. రేగులగూడెం ఆశ్రమ పాఠశాలలో రాత్రి వేళల్లో విద్యార్థులకు చెందిన రేషన్ బియ్యం, సరుకులను దొంగతనంగా బయటకు తరలిస్తున్న దృశ్యాలు సాక్ష్యాలతో సహా బయటపడినా, సంబంధిత జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎస్ టి డి డి చర్యలు గ తీసుకోకపోవడం అత్యంత శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వార్డెన్, ఉపాధ్యాయులను కాపాడేందుకు సంక్షేమ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇదివరకు జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం రాకపోవడంతోనే నేడు జిల్లా అదనపు కలెక్టర్ కలసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. అదనపు కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని క్రింది డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

సరుకుల దొంగతనానికి పాల్పడిన రేగులగూడెం ఆశ్రమ పాఠశాల వార్డెన్ మరియు సహకరించిన సిబ్బందిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలి.

ఫిర్యాదు చేసినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, అక్రమార్కులను కాపాడుతున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎస్ టి డి డి పై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.

ఉన్నత స్థాయి స్వతంత్ర అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని నియమించి, పాఠశాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.

అక్రమార్కులపై మరియు నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులతో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!