ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి పరామర్శ
జన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచారం ఆగస్టు 23:
జన్నారం: నాలుగు రోజుల క్రితం కంటికి సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాజుల లింగన్న గౌడ్ను సీనియర్ నాయకులు అజ్మీర హరి నాయక్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లింగన్న గౌడ్‌ను పరామర్శించిన వారిలో పీసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ కుమార్, దేవునిగూడ ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పీసీఆర్ ఫౌండేషన్ సభ్యులు ఉత్తూరు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

