ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeతెలంగాణపన్నూర్‌లో పండుగలా 787 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం...

పన్నూర్‌లో పండుగలా 787 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ చిందం మహేష్

📰 Generate e-Paper Clip

పన్నూర్‌లో పండుగలా 787 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : సర్పంచ్ చిందం మహేష్.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 24

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర ప్రజావాణి–ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పన్నూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన 787 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందం మహేష్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా చిందం మహేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా గ్రామపంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కొత్తగా మంజూరైన 787 స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సైతం మరింత సులభంగా, పారదర్శకంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కార్యదర్శి ప్రేమలత, జీపీఓ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ కావేటి మల్లేశ్వరి, రేషన్ డీలర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు సుధాకర్, ప్రదీప్, మున్ని రమాదేవి, మాజీ ఎంపీటీసీ ముస్త్యాల శ్రీనివాస్, పన్నూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, కమాన్‌పూర్ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ సిద్ధం మురళీకృష్ణ, గుగులోత్ ప్రవీణ్‌కుమార్, సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ నరెడ్ల శ్రీనివాస్, రామగిరి మండల ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు మోత్కూరి నవీన్ గౌడ్, కుంట శ్యామ్, నాగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!