ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణమంథని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించిన రైతులు, బీజేపీ నాయకులు…..24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి7గంటలు...

మంథని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించిన రైతులు, బీజేపీ నాయకులు…..24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి7గంటలు కరెంటు ఇస్తున్న మంత్రిశ్రీధర్ బాబు రాజీనామా చేయాలనీ డిమాండ్.

📰 Generate e-Paper Clip

మంథని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించిన రైతులు, బీజేపీ నాయకులు…..24గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి7గంటలు కరెంటు ఇస్తున్న మంత్రిశ్రీధర్ బాబు రాజీనామా చేయాలనీ డిమాండ్.

అర్జున్ సమాచారం ప్రతినిధి మంథని సెప్టెంబర్ 12.

మంథని విద్యుత్ డి. ఈ కి వినతిపత్రం అందించిన బీజేపీ నాయకులు, రైతులు

బీజేపీ రాష్ట్ర పార్టీ,మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి పిలుపు మేరకు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎల్క సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం లో భాగంగా ఈరోజు మంథని పట్టణంలో ని అంబేద్కర్ చౌక్ వద్ద రైతులతో కలసి బీజేపీ నాయకులు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి గారు,మరియు చల్లా నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు …
సునీల్ రెడ్డి గారు మాట్లాడుతూ…..
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వనికి రైతు గోస కనిపించడం లేదా, 24గం కరెంటు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 7గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి అర్థం అవుతుంది, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం లో రైతులు నీళ్ల కోసం ధర్నా చేయడం సిగ్గు చేటు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు వెంటనే రాజీనామా చేయాలనీ, బీజేపీ పాలిత ప్రాంతాలను చేసి సిగ్గు తెచ్చుకోవాలి అన్నారు వెంటనే రైతులకు 24గంటల నాణ్యమైన కరెంటు అందించాలని లేదంటే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు అనంతరం విద్యుత్ అధికారులకి వినతిపత్రం అందజేశారు…..ఈకార్యక్రమంలోరాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపక సత్యప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, నియోజకవర్గ కో కన్వీనర్ నంపెళ్లి రమేష్,మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, సబ్బాని సంతోష్,కొయ్యడ సతీష్, పగే రంజిత్, కొండ్రు లక్ష్మణ్, సీనియర్ నాయకు రాపర్తి సంతోష్,మట్ట శంకర్, మళ్లారపు అరుణ్,చిలువేరు సతీష్,విశ్వాతేజ,సామల అశోక్, భానుప్రకాశ్, తొట్ల రాజు రైతులు , సాదుల రమేష్, జాన్నే శ్రీనివాస్,రాజు,ఓదెలు, వెంకటేష్, రామూర్తి మరియు బీజేపీ నాయకులు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!