ePaper
Thursday, October 15, 2026
ePaper
Homeజగిత్యాలఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.ముఖ్యమంత్రి సహాయంతో...

ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.ముఖ్యమంత్రి సహాయంతో బాధిత కుటుంబానికి చెక్కు అందజేత.

📰 Generate e-Paper Clip

ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం.ముఖ్యమంత్రి సహాయంతో బాధిత కుటుంబానికి చెక్కు అందజేత.

కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి అడ్లూరి.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // జగిత్యాల జిల్లా ప్రతినిధి:

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తిపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.6 లక్షల చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ప్రభుత్వ ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ భీమ్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధంలో మృత్యువాత

ఉపాధి అవకాశాల కోసం సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లిన సుదర్శన్‌ గౌడ్‌.. అక్కడ కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో క్షిపణులు, డ్రోన్‌ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి యుద్ధ పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడంతో హస్నాబాద్‌ గ్రామంలో విషాదం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!