ePaper
Monday, September 14, 2026
ePaper
Homeతెలంగాణఇందారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇందారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

📰 Generate e-Paper Clip

ఇందారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 14. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్, సెప్టెంబర్ 14: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణనాథుడికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న తీరును మంత్రి అభినందించారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిభావంతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!