బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 1 | ముత్తారం రిపోర్టర్
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన ఉగ్గే మొగిలి తండ్రి రాజయ్య, అలాగే బుద్ధర్తి సంజీవ్, శంకర్, రాజేశంల తల్లి రాజమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.
ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోతుపెద్ది కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అత్తే చంద్రమౌళి, జక్కుల ముత్తయ్య, ముత్తారం సర్పంచ్ సుదాటి రవీందర్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు నూనె కుమార్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ నమ్మశాని సమ్మయ్య, ఖమ్మంపల్లి సర్పంచ్ నక్క రాజేశ్వరి రాజయ్య, ఉప సర్పంచ్ కార్కురి సతీష్, వార్డు సభ్యులు రావుల లక్ష్మి, ఆరుమనేశ్వరి, శ్రీశైలం, సమ్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కేక్కర్ల శీను, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు అల్లం దినేష్, ఏఎంసీ డైరెక్టర్ రమేష్, మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య తదితరులు పాల్గొన్నారు.

