ePaper
Wednesday, November 25, 2026
ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయండిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా.

డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా.

📰 Generate e-Paper Clip

డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు షేక్‌ హసీనా.

ఢాకా: అర్జున్ సమాచారం డెస్క్. నవంబర్ 24.

భారత్‌లో రెండేళ్లకుపైగా ఆశ్రయం పొందుతోన్న బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా  కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించారు. ఏటా డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌లో విక్టరీ డే నిర్వహిస్తారు. అదే రోజును ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఎంపిక చేసుకోవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ‘2024 ఆగస్టు 5న తాను బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వచ్చినందున.. తిరిగి దిల్లీ నుంచి తీసుకువెళ్లడానికి బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ను పంపాలని హసీనా బంగ్లాదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఆ సమయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఆమెను బహిష్కరించినందున.. డిసెంబర్ 16న విక్టరీ డే రోజున ఆమె గౌరవంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేలా చూడటం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత’ అని హసీనా సహాయకుడు పేర్కొన్నారు.  బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి హసీనా కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్‌ ను అభ్యర్థించారు. మరోవైపు ఆమెను స్వదేశానికి పంపాలంటే ఆ దేశం తమ సైనిక విమానాన్ని పంపాలని.. లేదా ఇరుదేశాల భూ సరిహద్దు మార్గంలో పొరుగు దేశ సైన్యం హసీనాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలని భారత్‌ షరతులు విధించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి వెళ్లే తేదీని ఖరారు చేయడం గమనార్హం. అయితే ఈ విషయంపై బంగ్లా ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ హసీనా తిరిగి దేశానికి వస్తే.. ఆమెను కచ్చితంగా అరెస్ట్‌ చేస్తామని బంగ్లా ప్రభుత్వ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. అదే సమయంలో ఆమెను తీసుకురావడానికి విమానాన్ని పంపడం గురించి భారత్‌తో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని పేర్కొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!