సింగరేణి కార్మికుల లాభాల వాటా ఏదీ? హామీలతో కాలయాపన.. కార్మిక సంఘాల మౌనంపై విప్లవ కార్మిక సంఘాల ఆగ్రహం!
బెల్లంపల్లి:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.
కార్మికుల సమస్యలు పరిష్కరించలేని సంఘాలు చందాల కోసం పోరాటాలా? గుర్తింపు సంఘాలు సమాధానం చెప్పాలి!
సింగరేణి బొగ్గు గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి, లాభాల సాధనకు నిరంతరం కృషి చేస్తున్న కార్మికులకు రావాల్సిన లాభాల వాటా విషయంలో జాప్యం జరుగుతున్నా కార్మిక సంఘాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయని విప్లవ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాము. కార్మికులకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇప్పించే విషయంలో చిత్తశుద్ధితో పోరాడాల్సిన సంఘాలు, అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నాం.
సింగరేణిలో గుర్తింపు సంఘంగా, ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతున్న సంఘాలు కార్మికుల లాభాల వాటా విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశాయి. కార్మికుల హక్కుల సాధనలో ముందుండాల్సిన సంఘాలు కీలకమైన సమస్యలపై నోరు మెదపకపోవడం కార్మిక వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నాము.
ముఖ్యమంత్రి దగ్గర తేల్చుకోలేని సమస్యలు.. కార్మికుల ముందు ఆందోళనలా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రితో నేరుగా చర్చలు జరిపి కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఎందుకు కృషి చేయడం లేదని విప్లవ కార్మిక సంఘాలు సూచిస్తున్నాము. ప్రభుత్వంతో చర్చలు జరిపి పరిష్కరించగల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించకుండా, కేవలం ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో కాలం గడపడం వల్ల కార్మికులకు ఒరిగేదేమిటని నిలదీశాయి.
కార్మికుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాల్సిన సంఘాలు, కార్మికుల నుంచి చందాలు వసూలు చేయడానికే పోరాటాల పేరుతో హడావుడి చేస్తున్నాయనే విమర్శలు కార్మిక వర్గంలో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నాయి. సంఘాలకు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, తమ రాజకీయ, సంఘ ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపి హక్కులను సాధించాలని డిమాండ్ చేశాయి.
కార్మికుల చందాలతో సంఘాల నిర్వహణనా? హక్కుల సాధన కోసమా?
సింగరేణి యాజమాన్యం కార్మికుల వేతనాల నుంచి కార్మిక సంఘాల చందాల రూపంలో జరిగే కోతలపై సమీక్ష జరిపి, వాటికి సంబంధించిన నిబంధనలు, కార్మికుల సమ్మతి, చట్టబద్ధతను స్పష్టం చేయాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామంటూ చెప్పుకునే సంఘాలు, కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలను సాధించడంలో విఫలమైతే వాటి జవాబుదారీతనాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.
కార్మికులారా.. మీ చందాలు తీసుకుంటున్న సంఘాలను ప్రశ్నించండి! మీకు రావాల్సిన లాభాల వాటా ఎక్కడుంది? దానిని సాధించేందుకు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు? ముఖ్యమంత్రితో చర్చలు జరిపారా? యాజమాన్యంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు? కార్మికులకు స్పష్టమైన సమాధానం చెప్పాలని సంఘాల నాయకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిస్తున్నాము.
లాభాల వాటా సాధించే వరకు పోరాటం ఆగకూడదు!
సింగరేణి కార్మికుల కష్టార్జితంతో సంస్థ లాభాలు ఆర్జిస్తున్నప్పుడు, ఆ లాభాల్లో కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటాను అందించేందుకు యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విప్లవ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా చందాలు వసూలు చేసే విధానంపై సమీక్ష జరగాలని, కార్మికుల హక్కుల సాధనకు సంఘాలు జవాబుదారీగా వ్యవహరించాలని కోరుతున్నాము.
కార్మికుల హక్కులు సాధించలేని సంఘాలకు కార్మిక వర్గం ఎందుకు చందాలు చెల్లించాలి? అనే ప్రశ్న ఇప్పుడు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ముందున్న ప్రధాన ప్రశ్నగా మారిందని విప్లవ కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని, లాభాల వాటా అందేవరకు కార్మికుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాము.
—విప్లవ కార్మిక సంఘాల డిమాండ్లు—
–సింగరేణి కార్మికులకు రావలసిన లాభాల వాటను వెంటనే చెల్లించాలి.
—లాభాల వాటా చెల్లింపులో జాప్యానికి కారణాలను యజమాన్యం, ప్రభుత్వం,
వెల్లడించాలి
—-గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యల పై తమ వైఖరినీ స్పష్టం చేయాలి.
—కార్మిక సంఘాల చందాల కోతలపై నిబంధనల ప్రకారము సమీక్ష జరిపి పారదర్శకత తీసుకురావాలి.
—కార్మిక సంఘాలు ముఖ్యమంత్రితో చర్చలు జరిపి పెండింగ్ సమస్యలు పరిష్కారానికి కార్యచరణ ప్రకటించాలి.
—సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసింది కాబట్టి కార్మికుల నుండి చందాలు వసూలు చేయడం నిలిపివేయాలి.
—సింగరేణిలో కొత్త బొగ్గు గనుల పరిస్థితి ఏంటి? ఈ యొక్క కార్యక్రమంలో T. మణి రామ్ సింగ్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, అంబాల మహేందర్ సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు (SGKS)M. పోచ మల్లు శ్రామిక శక్తి గోదావరి కార్మిక సంఘం (AIFTU) రాష్ట్ర కార్యదర్శి గజ్జె దుర్గయ్య, కాంట్రాక్ట్ వర్కర్స్ బెల్లంపల్లి జిల్లా నాయకులు (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు

