అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్.
రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అక్కపాక రాజయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనం రాంచందర్‌రావు, ఉప సర్పంచ్ అడూరి శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు తొగరి చంద్రయ్య, మాజీ సర్పంచ్ కోనేటి ఓదేలు, వార్డు సభ్యుడు మల్లారపు స్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అడ్డూరి. ప్రవీణ్, వలస శ్రీనివాస్, రత్న రాజేశం,
వేముల సత్యం, అక్కపాక వెంకటి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

