ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeస్పోర్ట్స్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కారానికి ఎంపికైన బాల ప్రకృతి ప్రేమికుడు...

జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కారానికి ఎంపికైన బాల ప్రకృతి ప్రేమికుడు – అవార్డు కోసం వెళ్లే ఖర్చుతో మొక్కలు నాటుతా.. అవార్డులు కాదు పచ్చదనమే పెంచడమే ముఖ్యం – తెలంగాణ బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
పర్యావరణ పరిరక్షణలో తనదైన ముద్ర వేస్తూ, చిన్న వయసులోనే పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతున్న తెలంగాణ బాల ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ కు అరుదైన జాతీయ గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక “రాష్ట్రీయ హరిత గౌరవ పురస్కార్ 2026” కు ఎంపికయ్యాడు. రాజస్థాన్ కేంద్రంగా 40 ఏళ్లుగా పర్యావరణ సేవలో తలమునకలై, కోట్లాది మొక్కలు నాటి “ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా” గా పేరుగాంచిన శ్రీ విష్ణు లాంబా ఆధ్వర్యంలోని కల్పతరు సంస్థాన్ ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ నెల 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ లోని కనోరియా పీజీ మహిళా మహావిద్యాలయ ఆడిటోరియం, జెఎల్ఎన్ మార్గ్ లో జరిగే “పర్యావరణ మహాకుంభ్” కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ఎంపికైన 25 మంది ప్రకృతి ప్రేమికులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.గతంలో ఈ పురస్కారాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అందుకోవడం విశేషం. ఈ పురస్కారాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ హరిబావు భాగ్డే చేతుల మీదుగా అందుకున్నారు అవార్డు కార్యక్రమంలో గతంలో మరో గవర్నర్ కల్రాజ్ మిశ్రా పాల్గొని అవార్డులు ప్రధానం చేశారు అటువంటి ప్రతిష్టాత్మక జాబితాలో చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ చోటు దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణం.అయితే ఈ సందర్భంగా విశ్వామిత్ర చౌహాన్ చూపిన నిబద్ధత అందరినీ ఆలోచింపజేస్తోంది. జైపూర్ వెళ్లి రావడానికి ప్రయాణ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ఆ ఖర్చుతో అవార్డు కోసం వెళ్లడం కంటే, ఆ డబ్బులతో అన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతానని తనకు అవార్డులు, రివార్డులు ముఖ్యం కాదని, పచ్చదనం పెంచడమే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశాడు. అవార్డు కంటే ఆలోచన గొప్పదన్న ఈ బాలుడి మాట నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం.అయినప్పటికీ నిర్వాహకులు విశ్వామిత్ర కోసం ప్రత్యేకంగా ప్రయాణ ఖర్చులు తాము భరించి ఆహ్వానించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలతో, భావి తరాలకు పచ్చని భవిష్యత్తును అందించాలనే తపనతో ముందుకు సాగుతున్న విశ్వామిత్ర చౌహాన్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!