ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
దేశంలో ఎక్కడా లేనంత మంది కవులు, కళాకారులు కరీంనగర్ సొంతం
మధుపాలీస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ బుక్ అద్బుతం
విద్యా సంస్థలకు, యువతకు ఎంతో ఉపయోగపడే పుస్తకం.
మోదీజీ చరిత్రను పుస్తక రూపంలో తెలుగు వారికి అందించండి

కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాను దేశమంతా పర్యటిస్తున్నానని, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని చెప్పిన బండి సంజయ్ కరీంనగర్ లో ఉన్నంత మంది కవులు, కళాకారులు మరే జిల్లాలోనూ లేరని చెప్పారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్న కవులు, కళాకారులు పుట్టిల్లు కరీంనగర్ నుండి తాను ఎంపీగా, మంత్రిగా కొనసాగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు కరీంనగర్ లోని మంకమ్మ తోట సాయి మానేరు స్కూల్ లో కవి, రచయిత, ఎస్సారార్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్, లయన్ కెప్టెన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలపై రాసిన ఆర్టికల్స్ తో రూపొందించిన పుస్తకాన్ని మధుపాలీస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పేరుతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మానేరు స్కూల్స్ అధినేత అనంత రెడ్డి, టీబీఎస్ఎస్ అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏమన్నారంటే..నేను దేశమంతా తిరుగుతున్నాను. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. కానీ దేశంలో ఎక్కడా లేనంత మంది కళాకారులు కరీంనగర్ లో వున్నారు. వీరంతా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అందులో డాక్టర్  మధుసూదన్ రెడ్డి ఒకరు. ఇక్కడ నేను ఎంపీగా, మంత్రిగా ఉండటం నా అద్రుష్టం.
మధుపాలీస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పేరుతో లయన్ కెప్టెన్, ఎస్సారార్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి  రాసిన ఆర్టికల్స్ ను ఈ విధంగా పుస్తక రూపంలో తీసుకురావడం, నా చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే..ఈ 400 పేజీల పుస్తకం విద్యా సంస్థలకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతకు ఎంతో ఉపయోగపడుతుంది.
కాలేజీ ప్రిన్సిపాల్ గా రిటైర్డ్ అయి విశ్రాంతి తీసుకోవాల్సిన మధుసూదన్ రెడ్డి అవిశ్రాంతంగా ఇలాంటి ఆర్టికల్స్ రాస్తూ సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు ప్రధానమంత్రి మోదీ జన్మదినం. ఒకనాడు విదేశాలకు వెళతానంటే వీసా కూడా నిరాకరించిన దేశాలు సైతం నేడు మోదీ సేవలను చూసి రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతున్నాయి. ఆయన సాష్టాంగ పడుతున్నయి. మోదీ సేవను చూసి సగటు భారతీయుడు సైతం నేను ఇండియన్ అని గల్లా ఎగిరేసేలా పని చేస్తున్నారు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన మోడీ గురించి ఎన్నో విషయాలున్నాయని, వాటిని పుస్తక రూపంలో తెలుగు వాళ్లకు అందించాల్సిన అవసరం ఉంది. ధుసూదన్ రెడ్డిని కలవడం అంటే చరిత్రను తరచి చూడటమే. ఇలాంటి పుస్తకాన్ని ఆయన మాత్రమే రాయగలరు.
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!