హైదరాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్రంలో 22 A కింద నిషేధిత జాబితాలో నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రిశ్రీ ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాల పరిష్కారానికి సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు.
నిషేధిత జాబితా 22A పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై ముఖ్యమంత్రి సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి చేసిన చట్టాలు, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని సభలో వివరించారు.
న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఆ 12 అంశాలను సభలో వెల్లడించారు.
. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ULC భూములు : పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు., యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడుతాం. 2. అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు (HMDA / GHMC / DTCP) :, కాంపిటెంట్ అథారిటీచే ఆమోదించబడిన లేఅవుట్లలో పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు

