పెద్దపల్లి,అర్జున్ సమాచారం:
గోదావరిఖనిలో డిప్లొమా పూర్తి చేసి, ఈసెట్ ద్వారా ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీటు సాధించి, ఇంటర్న్షిప్ కోసం ఈ ఏడాది సింగరేణి సంస్థలో ఓ విద్యార్థిని (21) చేరింది. ఈ క్రమంలో తాను కూడా డిప్లొమా అదే కాలేజీలో చేశానని చెప్పి విద్యార్థినికి బొమ్మకంటి రవికుమార్ అనే ఓవర్మ్యాన్ (సూపర్వైజర్) పరిచయమైయారు. ఈ క్రమంలో యువతిపై రవికుమార్ లైంగిక దాడికి పాల్పడగా, యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇంటర్న్షిప్ మానేసి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్ సెంటర్లో విద్యార్థిని పని చేస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకుడు నవీన్, రవికుమార్ తనను వేధించడం ఆపకపోవడంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14న విద్యార్థిని మృతిచెందగా, నవీన్, రవికుమార్పై పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేసాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
అయితే తనపై రవికుమార్ అత్యాచారానికి పాల్పడినట్టు సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు రాసిన సూసైడ్ నోట్ లభించిందని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్యకు బాధ్యులైన సింగరేణి అధికారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఆఫీస్ రహదారిపై మృతదేహంతో బైఠాయించారు.
=================
లైంగిక వేధింపులతో సింగరేణి ఇంటర్న్ విద్యార్థిని ఆత్మహత్య తనను ఓ అధికారి రేప్ చేశాడని సూసైడ్ నోట్లో పేర్కొన్న విద్యార్థిని ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
RELATED ARTICLES

