ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి యూనిట్ ఇంఛార్జ్‌లకు శిక్షణలో సీఎం చంద్ర‌బాబు

గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి యూనిట్ ఇంఛార్జ్‌లకు శిక్షణలో సీఎం చంద్ర‌బాబు

📰 Generate e-Paper Clip

తాడేప‌ల్లి,అర్జున్ సమాచారం :
టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇంఛార్జ్‌లకు శిక్షణా తరగతులకు  ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేసారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ   కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నాం. పార్టీ భావజలాన్ని అర్థం చేసుకోవాలి… ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోకుంటే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని అన్నారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది.. దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగాం. డీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగాం కాబట్టే… గొడ్డలి పార్టీ మినహా కొన్ని పార్టీలకు చెందిన నేతలు ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారు. డీఎస్సీ ద్వారా రిక్రూటైన టీచర్లే ఇవాళ గొడ్డలి పార్టీ తీరును తప్పు పడుతూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే… గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనం. పారదర్శకంగా వ్యవహరించి.. వాస్తవాలు చెబితే… ప్రజలే కుట్రలను చేధిస్తారనడానికి కర్నూల్లో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళనే ఉదాహరణ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానుని అన్నారు.
ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా… వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం-అభివృద్ధి చేస్తున్నాం. సాధారణ కార్యకర్తకైనా… పార్టీ అగ్రనాయకుడికైనా పార్టీనే సుప్రీం. ఏయే నియోజకవర్గాల్లో ఏమేం జరుగుతున్నాయోననే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. కార్యకర్తలను పట్టించుకోని వారిని… పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.
ఏ ఎన్నికలు జరిగినా… ప్రతి బూత్ లోనూ గడచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే రావాలి. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి, నాయకుడి ప్రవర్తన ఓట్లపై చాలా ప్రభావం చూపుతుంది.యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చేస్తామ‌ని అన్నారు
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!