హైదరాబాద్,అర్జున్ సమాచారం:
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి అయింది. నిమజ్జనం కు సహకరించిన అందరికి ధన్యవాదాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం నాడు అయన సెక్రటేరియట్ దగ్గర మీడియాతో మాట్లాడారు.
సీపి మాట్లాడెఉతూ ఖైరతాబాద్ నిమజ్జనంను చూసేందుకు ప్రజలకు – దేశ విదేశాల యాత్రికులకు ధన్యవాదాలు. విగ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల నిమజ్జనం కొంత ఆలస్యంఅయింది. ఖైరతాబాద్ గణేష్ ను 30 లక్షలు, బాలాపూర్ 15 లక్షలు దర్శనం చేసుకున్నారు. నిమజ్జనం లో అక్కడక్కడా లోపాలను గుర్తించ్చాం.. లోపాలను వచ్చే నిమజ్జనం కు సరిదిద్దుతాం. పేపర్ షాట్ మిషన్లు వాడటం వల్ల నగరం అంతా చెత్త పడింది. వచ్చే ఏడాది వరకు పేపర్ షాట్ మిషన్ ను బ్యాన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. అన్నధానం చేసిన వాళ్ళు చెత్తను ఎక్కడికక్కడ పడేసి వెళ్లారు. సరైన సమయం లో నిమజ్జనం టైం కు పూర్తి చేయడంలో సక్సెస్ కాలేదని అన్నారు.
నిమజ్జనంలో డ్రంక్ చేసి వచ్చారు… వల్గల్ డాన్స్ లు చేశారు. రాజకీయ పాటల పేరుతో వల్గల్ డాన్స్ లు చేస్తున్నారు.. అలాంటివి గుర్తించాం సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టాం.. కేసుల లిస్ట్ ను త్వరలో బయటపెడుతామని అన్నారు.
========================

