ePaper
Friday, September 11, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు టెస్ట్ డ్రైవింగ్‌కు వెళ్తుండగా...

బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు టెస్ట్ డ్రైవింగ్‌కు వెళ్తుండగా పొగలు.. క్షణాల్లో దగ్ధమైన కారు

📰 Generate e-Paper Clip

విజయవాడ:అర్జున్ సమాచారం:
నగరంలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సమీపంలో, జ్యోతి కన్వెన్షన్ ఎదురుగా గురువారం ఉదయం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంబిర్కా డీజిల్ మెకానిక్ కార్స్ షోరూమ్ నుంచి టెస్ట్ డ్రైవింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కారు ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పక్కనే ఉన్న వ్యక్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే డ్రైవర్ కారు ఆపి డోర్ తీసుకుని బయటకు వచ్చేలోపే కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు కొద్దిసేపటికే పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన అక్కడికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ప్రమాద సమయంలో డ్రైవర్ సకాలంలో బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటన కారణంగా ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.

సకాలంలో స్పందించిన పోలీసు, ట్రాఫిక్ పోలీసు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!