బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.
అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 16 | ముత్తారం రిపోర్టర్.
ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన బందారపు లక్ష్మి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ. లక్కారం సర్పంచ్.అత్తే చంద్రమౌళి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డితో పాటు పలువురు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

