ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మూసీతరంగాలు - సింహవాహినిశతకం ఆవిష్కరణ సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి

మూసీతరంగాలు – సింహవాహినిశతకం ఆవిష్కరణ సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం  :                మూసీ నది ప్రాశస్త్యము- ఆషాడ బోనాల ఉత్సవాల  వైభవ ప్రభావాల ను సమన్వయం చేస్తూ ‘ మూసి తరంగాలు- సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్  ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ. వెంకట నరసింహారెడ్డి లు ఆవిష్కరించారు.
శుక్రవారం మాసబ్ ట్యాంక్ మూసి పునర్జీవన సంస్థ కార్యాలయంలో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన  జరిగిన కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్,  కవి వరకాల యాదగిరి హైదరాబాద్ నగర సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు బోనాల పండగ విశిష్టతపై ‘మూసీతరంగాలు సింహవాహిని శతకం’ ను విడుదల చేశారు.
ఆషాడ మాసంలో చారిత్రాత్మక గోల్కొండ కోటలో వెలిసిన శ్రీ జగదాంబిక ఆలయంలో ప్రారంభమైన బోనాలు బల్కంపేట రేణుక ఎల్లమ్మ కళ్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు, చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని  మహంకాళిఆలయంలో నిర్వహిస్తున్న బోనాల పండుగ వేడుకల  విశిష్టతతో నెలరోజుల పాటు కొనసాగే బోనాల సంబరాల వైభవాన్ని పుస్తకంలో అద్భుతంగా విశ్లేషించారని ఈ సందర్భంగా మూసి పునర్జీవన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ వెంకట్ నర్సింహారెడ్డి అన్నారు.
హైదరాబాదు నగరంలోని పలు మహంకాళి ఆలయాల్లో జరిగే బోనాల పండగ వేడుకలతో పాటు ఒకప్పుడు హైదరాబాదు నగర ప్రజల జీవనాడి  ముచుకుందా నది ప్రవాహ వర్ణన లను  సూత్రికరించటం విశేషమ న్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన మూసీ నది సమూల ప్రక్షాళన  ప్రాధాన్యతను పద్యాల రూపంలో ఆకట్టుకునే రీతిలో కవి జర్నలిస్ట్ వరకాల యాదగిరి  సాహితీ వర్ణన పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటుంద న్నారు. ఆధునిక కాలంలో సంప్రదాయ తెలుగు పద్య సాహిత్యాన్ని  ‘మూసీ తరంగాలు- సింహవాహిని  శతకం’  ను వెలువరించడం  ముదావహం అని వెంకట నరసింహారెడ్డి ప్రశంసించారు.
ఈ సందర్భంగా సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ వరకాల యాదగిరి కలం నుంచి వార్తలు వ్యాసాలే కాక పద్య సాహిత్యం వెలువడటం విశేషమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది అభివృద్ధి పనుల ప్రాధాన్యతను విశ్లేషించడంతోపాటు హైదరాబాదు నగర చారిత్రాత్మక సంప్రదాయ బోనాల వేడుకల వైభవాన్ని పుస్తకంలో అద్భుతంగా వర్ణించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా యాదగిరి తన అనుభవంతో  హైదరాబాద్ నగర వారసత్వ సంస్కృతిపై  రాసిన చారిత్రాత్మక అంశాలు నేటి తరానికి విజ్ఞాన దాయకంగా ఉంటాయని అన్నారు. సంప్రదాయ సాహిత్యం ను కోరుకునే తెలుగు పాఠకులను ‘మూసి తరంగాలు -సింహ వాహినిశతకం’  విశేషంగా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కవి వరకాల యాదగిరి మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాలుగా నిరంతరం మూసి నది ప్రవాహాన్ని పరిశీలించిన అనుభవం, చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపై ఉన్న ఆసక్తి తో  పుస్తకాన్ని వెలువరించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూసి పునర్జీవన సంస్థ డైరెక్టర్ విష్ణువర్ధన్ రావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత కవి యాదగిరికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించా
===================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!