ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లరాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ భక్తులు పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు...

రాజన్న ప్రసాదంగా కోడెల పంపిణీ భక్తులు పాలు మరవని చిన్న కోడెలను సమర్పించవద్దు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల ,అర్జున్ సమాచారం:
రైతులకు రాజన్న ప్రసాదంగా కోడెలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలను సన్న, చిన్నకారు రైతులకు రాజన్న ప్రసాదంగా అందించే కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు కోడెలను అందజేశారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే తండ్రిగా భక్తుల విశ్వాసాన్ని పొందిన రాజన్నకు కోడె మొక్కు చెల్లించడం విశిష్టమైన సంప్రదాయమన్నారు
కోడెలను గతంలో స్వచ్ఛంద సంస్థలకు అందించే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని,ఈనేపథ్యంలో నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులకు అందించాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరింత పద్ధతిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నట్లు  వివరించారు.
కోడెలను సంరక్షించాలి

రైతులు రాజన్న ప్రసాదంగా భావించి, తమ బిడ్డలను ఎలా చూసుకుంటారో అలాగే కోడెలను సంరక్షించాలని కోరారు. కోడెల సంరక్షణపై దేవాదాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. కోడెలను అక్రమంగా తరలించడం లేదా ఇతర మార్గాల్లో వినియోగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాలు మరవని కోడెలను ఇవ్వకూడదు

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు పాలు మరువని కోడెలను ఇవ్వకూడదని ప్రభుత్వ విప్ విజ్ఞప్తి చేశారు. చిన్న కోడెలను దూర ప్రాంతాల నుంచి తరలించడం,
ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అలాగే జెర్సీ జాతి కోడెలు కూడా ఇవ్వద్దని సూచించారు. ఎదిగిన, ఆరోగ్యంగా ఉన్న దేశీ కోడెలను మాత్రమే సమర్పించాలని సూచించారు.

* కోడెలకు నాణ్యమైన దాణా, వైద్య సేవలు

కోడెలకు ఆరోగ్య సమస్యలు రాకుండా టీకాలు, వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన పోషకాహారం, దాణా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

=============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!