సిద్దిపేట,అర్జున్ సమాచారం:
సిద్దిపేట జిల్లా కోర్టు లో జిల్లా సెషన్స్ జడ్జి ఆర్. సుదర్శన్ జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ. సెప్టెంబర్ 12వ తేదీన జిల్లా కోర్టుతో పాటు సిద్దిపేట జిల్లా లోని దుబ్బాక గజ్వేల్, చేర్యాల మరియు హుస్నాబాద్ లో గల కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ ద్వారా పరిష్కరించదగ్గ కేసులను పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ సంవత్సరం మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 756 కేసులు పరిష్కరించడం జరిగిందని. వాటిలో మోటార్ వాహనాల సంబంధించిన కేసులో 92 లక్షల 26 వేల నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని బ్యాంకు కేసులకు సంబంధించి 30 లక్షల 32 వేల రూపాయలు సెటిల్ చేయడం జరిగిందని అన్నారు. జూన్ లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా 814 కేసులు పరిష్కారమయ్యాయని వీటిలో మోటర్ వాహనాలకు సంబంధించిన కేసులో 78 లక్షల 65000 రూపాయల నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని, బ్యాంకు కేసులకు సంబంధించి 5 లక్షల 77 వేల రూపాయల సెటిల్మెంట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ ద్వారా పోక్సో కేసులలో బాధితులకు 25 లక్షల రూపాయల అవార్డు కాగా 4 లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు.
సెప్టెంబర్ 12 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ద్వారా పరిష్కరించేందుకు 1776 కేసులను గుర్తించడం జరిగిందని వాటిలో 518 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగిందని, చెక్ బౌన్స్ సంబంధించిన 1323 కేసులను గుర్తించి నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. కావున సెప్టెంబర్ 12 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించే వీలున్న కేసుల కు సంబంధించిన కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ జడ్జి సూచించారు.
==========================
రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలి డిస్టిక్ సెషన్స్ జడ్జ్ ఆర్. సుదర్శన్ సిద్దిపేట
RELATED ARTICLES

