ePaper
Friday, October 30, 2026
ePaper
Homeజాతియంఢిల్లీరామ్‌లీలా మైదానానికి తరలిరండి.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమం...

రామ్‌లీలా మైదానానికి తరలిరండి.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమం అని వెల్లడి ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని స్పష్టం భయపడకుండా విద్యార్థులు తరలిరావాలని ప్రత్యేక విజ్ఞప్తి పోలీసులకు, లాఠీలకు భయపడొద్దని యువతకు ధైర్యం చెప్పిన రాహుల్

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ రామ్‌లీలా మార్చ్’కు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ఆత్మను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమమని, ఓట్ల దొంగతనాన్ని అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎన్నికల కమిషన్ వైఖరితో విభేదించే ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే పౌరులందరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. “మీ భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆలోచనలు, జీవన విధానంపై దాడి జరుగుతోందని మీరు భావిస్తే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ మార్చ్‌కు తరలిరండి. పోలీసులకు, లాఠీలకు భయపడవద్దు. బీజేపీ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడే సాహసం చేయదు” అని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని, దీనిని విజయవంతం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
==========

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!