ePaper
Friday, October 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపరూటు మార్చిన జగన్. గెలుపు గుర్రాల కే టిక్కెట్టు స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక...

రూటు మార్చిన జగన్. గెలుపు గుర్రాల కే టిక్కెట్టు స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక పై వైసీపీ కొత్త వ్యూహం మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు మూడు పేర్లు. సర్వేలు,క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా తుది ఎంపిక. జిల్లా అధ్యక్షులకు జగన్ దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

తాడేపల్లి,అర్జున్ సమాచారం:
స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ఎంపిక విషయంలో రూటు మార్చినట్లు,పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది.గతంలో నాయకత్వానికి నచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చే విధానానికి భిన్నంగా ఈసారి గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం
ముఖ్యంగా మేయర్, మున్సిపల్ చైర్మన్ వంటి కీలక పదవులకు ముందుగానే ఒక పేరును ఖరారు చేయకుండా.ప్రతి స్థానానికి మూడు పేర్లతో జాబితా సిద్ధం చేయాలని పార్టీ జిల్లాఅధ్యక్షులు,స్థానిక నాయకత్వానికి,సూచించి నట్లు తెలుస్తోంది.ఈ ముగ్గురిలో ఎవరి పట్ల ప్రజలలో ఆదరణ ఉందో  ఎవరి సామాజిక సమీకరణాలుఅనుకూలంగా ఉన్నాయో ? పార్టీ కేడర్‌ను ఎవరు సమన్వయంచేయగలరో. అనే అంశాలను పరిశీలించి తుది అభ్యర్థిని ఎంపిక చేసే విధానం ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక సిఫార్సులకే పరిమితం కాకుండా.స్థానిక ఎన్నికలలో అభ్యర్థి వ్యక్తిగత బలం కీలకంగా ఉండ టంతో,కేవలం నాయకుల సిఫార్సులు, పరిచయాలు, వర్గ సమీకరణాల ఆధారంగా కాకుండా సర్వేలు,క్షేత్రస్థాయి సమాచారం, ప్రజాభిప్రాయం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్లు,సమాచారం.ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్ల,తో నిర్భహించిన సమా వేశాలలో స్థానిక ఎన్నికల సన్నద్ధత పై జగన్ సమీక్ష నిర్వహించారు.బలమైన, విశ్వసనీయమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని,స్థానిక నాయకులు కేడర్‌తో విస్తృతంగా చర్చించాలని సూచించినట్లు వైఎస్సార్‌సీపీ అధికారికంగా వెల్లడించింది

మూడు పేర్లు ఒకే తుది ఎంపిక,

మేయర్,చైర్మన్ స్థానాలకు మూడు పేర్లను పరిశీలనలో ఉంచి,వాటిలో గెలుపు అవకాశాలు,ప్రజలలో ఉన్న గుర్తింపు,స్థానిక రాజకీయ సమీకరణాలు,కేడర్ బలం తదితర అంశాలను బేరీజు వేసి తుది అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది.స్థానిక ఎన్నికలలో టిక్కెట్ కోసం జరిగే లాబీయింగ్‌,కు బదులుగా “గెలిపించే సత్తా..ఎవరికుంది.అనే ప్రశ్నకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉందన్న చర్చ వైఎస్సార్‌సీపీలోమొదలైంది.గత అనుభవాల నేపథ్యంలో వ్యూహ మార్పు. స్థానిక ఎన్నికలలో పార్టీ గుర్తుతో పాటు అభ్యర్థి వ్యక్తిగత,పరిచయాలు,సామాజిక సంబంధాలు,స్థానిక సమస్యల పై అవగాహన,కేడర్‌తో సమన్వయం వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.ఈసారి ముందుగానే మూడు పేర్లను గుర్తించి,క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రక్రియ అమలైతే వైఎస్సార్‌సీపీ స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఒక విధమైన సర్వే ఆధారిత ఎంపిక విధానం కు నాంది పలికినట్లవుతుంది.తుది అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యే వరకు పేర్లు,సామాజిక సమీకరణాలు,రిజర్వేషన్లుతదితర అంశాల ఆధారంగా మార్పులు ఉండే అవకాశం ఉంది.మూడు పేర్లను పరిశీలించి చివరకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థికే టిక్కెట్, . ఇవ్వాలన్నది ప్రస్తుతం పార్టీ వర్గాలలో వినిపిస్తున్న ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!