ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి విద్యార్దులపై లాఠీ చార్జ్ అమానుషం మంత్రి పొంగులేటి

విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి విద్యార్దులపై లాఠీ చార్జ్ అమానుషం మంత్రి పొంగులేటి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల కలలు ఛిద్రమయ్యాయి. వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని మంత్రి పొంగులెటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడం అత్యంత దురదృష్టకరం.  నీట్ పరీక్ష పేపర్ లీకేజీ  ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి , కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన నిరసనలకు మద్దతుగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ,   కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపీ ప్రియాంక గాంధీ,  విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం.  ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అయన అన్నారు.
రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ యు విద్యార్థులకు గాయాలయ్యేవిధంగా.. రక్తసిక్తమైన  అరెస్టు తీరుపై నిరసినగా ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో లోక్ భవన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నమాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహచర మంత్రులు దామోదర రాజనర్సింహ  మంత్రి మహమ్మద్ అజారుద్దీన్రు, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్  బల్మూరి వెంకట్ , ఎమ్మెల్యేలు దానం నాగేందర్రు, నవీన్ కుమార్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున ఎన్ ఎస్ యు విద్యార్థులు, వేలాదిమంది కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టి, చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు.
తనేవాత రం నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ, నినాదాలు చేస్తూ చలో లోక భవన్ కు భారీ ర్యాలీగా బయలుదేరి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించడం జరిగింది. ప్రజలు, విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అణచివేయడానికి అరెస్టులను ఆయుధంగా ఉపయోగించడం సిగ్గు చేటని మంత్రి విమర్శించారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!