ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeసినిమాసింగ’ సినిమా పవర్‌ఫుల్‌ పోస్టర్ రిలీజ్

సింగ’ సినిమా పవర్‌ఫుల్‌ పోస్టర్ రిలీజ్

📰 Generate e-Paper Clip

టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం

ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్,

గోపీచంద్ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ ఎనౌన్స్‌మెంట్.. రా అగ్రెషన్, ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన వరల్డ్ ని ప్రజెంట్ చేసింది.
తాజాగా చిత్ర బృందం కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సినిమా చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ స్పెషల్ సెట్స్‌ను నిర్మించి, కీలక

సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పై మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా అనుకున్న విధంగా అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది.
మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో గోపీచంద్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తున్నారు. మిస్టీరియస్ అడవిలోని ఓ రాతి గుట్టపై నిలబడి, డార్క్ బ్లూ సంప్రదాయ దుస్తుల్లో, రఫ్ లుక్‌తో కనిపిస్తున్న

గోపీచంద్, పాత్రలోని ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఆయన చేతిలో ఉన్న భారీ, ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించిన ఆయుధం పాత్రను మరింత పవర్ ఫుల్ గా చూపిస్తోంది.
నెక్స్ట్ షెడ్యూల్ కోసం మరింత భారీ సెట్స్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ షెడ్యూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఉన్నతమైన నిర్మాణ విలువలతో
సినిమాను నిర్మిస్తున్నారు.
‘సింగ’లో గోపీచంద్‌ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు, డ్రామా కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్
సన్నివేశాలను తెరకెక్కించడంలో మంచి  అనుభవం ఉన్న వి. వెంకట్ దర్శకుడిగా కావడంతో, ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన బిగ్ స్క్రీన్  ఎక్స్ పీరియన్స్ అందించనుంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. షామ్‌దత్ ఐఎస్‌సీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్. రామకృష్ణ-మోనికా
ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: టి. గోపీచంద్, అనార్కలి నాజర్.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!