ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్భార్యను రోకలి బండతో కొట్టి హత్య

భార్యను రోకలి బండతో కొట్టి హత్య

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి (బాగ్లింగంపల్లి)లో దారుణం చోటుచేసుకుంది.  తీవ్ర కుటుంబ కలహాల కారణంగా భార్యను భర్త రోకలి బండతో బాది దారుణంగా హతమార్చాడు. మృతురాలు

తేజస్వి (28) భర్త ,కుప్పల నరేందర్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని ఒక హోటల్ పని చేస్తున్నాడు.  ఈ దంపతులు సుమారు 4 నెలల క్రితమే బాగ్లింగంపల్లికి వచ్చారు. వీరికి 5 ఏళ్ల కుమారుడు (లోహిత్) ఉన్నాడు.

ఆదివారం ఉదయం దంపతుల మధ్య కుటుంబ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది.   ఆవేశంతో రగిలిపోయిన నరేందర్.. ఇంట్లోని రోకలి బండతో భార్య తలపై బలంగా బాదాడు. తలకు తీవ్ర గాయమై

రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.  సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎల్. మధుబాబు బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  మృతదేహాన్ని

గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!