ePaper
Friday, August 14, 2026
ePaper
Homeజాతీయంయువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ

యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
నీట్ పరీక్షా పత్రాల లీకేజిపై కొద్దిరోజులకుగా జరుగుతున్న అందోళనలో ప్రధాన డిమాండ్ కు జవాబుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేసారు. పది 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు . యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశానని అన్నారు.
దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత చదువు కోసమే సమయం కేటాయించాలని అన్నారు.
భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు… వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని అన్నారు.
జంతర్-మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు.  ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని  ప్రధానమంత్రి కి పంపించాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలను అందిస్తూనే ఉంటానని అయన తన రాజీనామా లేఖలో పేర్కోన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!