ధాంపూర్ గ్రామ పంచాయతీలో ‘ఎస్‌ఐఆర్ -2026’ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌పై గ్రామసభ:
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 27:
ధాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉదయం 9:00 గంటలకు ‘ఎస్‌ఐఆర్ -2026’ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శ్రీ చెగొండ కుమార్ మరియు భీమారం తహసీల్దార్ సదానంధం సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభ కొనసాగింది.
గ్రామ సభలో ఎస్‌ఐఆర్–2026 డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రజలకు బిగ్గరగా చదివి వినిపించారు. జాబితాలోని పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాల్లో తప్పులు, మార్పుల సవరణలపై ,మరియు గ్రామస్తుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
గ్రామసభ అనంతరం పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామ పంచాయతీ ఆవరణలో భీమారం తహశీల్దార్ స్వయంగా ఒక మొక్కను నాటారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక గ్రామసభలో దాంపూర్ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, బూత్ లెవెల్ ఆఫీసర్లు (బిఎల్‌ఓ), అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది, గ్రామ యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

