ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట.గుర్తింపు లేని ఓటర్లకు నిబంధనల మేరకు నోటీసులు: ముఖ్య ఎన్నికల...

ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట.గుర్తింపు లేని ఓటర్లకు నిబంధనల మేరకు నోటీసులు: ముఖ్య ఎన్నికల అధికారి,

📰 Generate e-Paper Clip

ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు పెద్దపీట.గుర్తింపు లేని ఓటర్లకు నిబంధనల మేరకు నోటీసులు: ముఖ్య ఎన్నికల అధికారి,

అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల, ఆగస్టు 19:ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా గుర్తింపు అనుసంధానం కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్‌ నుంచి దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ముసాయిదా ఓటరు జాబితా, జిల్లాల వారీగా గుర్తించిన అనుసంధానం కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు, నోటీసుల జారీ, తదుపరి విచారణ ప్రక్రియపై అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానం కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అదనంగా 395 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులను కేటాయించినట్లు తెలిపారు. వారికి ప్రత్యేక ప్రవేశ సౌకర్యాలు కల్పించి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి, నిర్ణీత విధానంలో విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల జిల్లాలో 1.70 లక్షల మందికి నోటీసులు
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో గుర్తించిన 1,70,967 మంది అనుసంధానం కాని ఓటర్లు, వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు బూత్‌ స్థాయి అధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నోటీసుల జారీ, విచారణ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, ప్రత్యేక ఉప కలెక్టర్‌ చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌, శిక్షణలో ఉన్న ఉప కలెక్టర్‌ మహమ్మద్‌ విలాయత్‌ అలీ, మండలాల తహసీల్దార్లు, సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!