ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణమహిళా సాధికారత దిశగా ముందడుగు రాజాపూర్‌లో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ

మహిళా సాధికారత దిశగా ముందడుగు రాజాపూర్‌లో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

మహిళా సాధికారత దిశగా ముందడుగు రాజాపూర్‌లో మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ.

అర్జున్ సమాచారంసెప్టెంబర్ 12, రామగిరి డెస్క్.

స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో అలీఫ్ సంస్థ ఆధ్వర్యంలో రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మే నెలలో ప్రారంభమైన ఈ శిక్షణలో పాల్గొన్న మహిళలకు శుక్రవారం ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజాపూర్ సర్పంచ్ పుల్లేల భాగ్యలక్ష్మి కొమురయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కుట్టుమిషన్ శిక్షణతో మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు చొరవతో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి కల్పించే ప్రత్యేక పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాల్వ శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కన్నూరి వెంకటయ్య, వార్డు సభ్యులు కాల్వ రజిత, పుల్లెల సుజాత, కన్నూరి శశికుమార్, ఎండీ ఆఫీస్ కాదాసి ఓదమ్మ, కాంగ్రెస్ నాయకులు మాటేడి రవి, కన్నూరి పర్వతాలు, శ్రీనివాస్, తిరుపతి, రోహిత్, మల్లేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!