ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణకార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘాలు విఫలంటిబిజికెఎస్ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య.

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘాలు విఫలంటిబిజికెఎస్ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య.

📰 Generate e-Paper Clip

కార్మిక సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘాలు విఫలంటిబిజికెఎస్ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య.

అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 12 / రామగిరి డెస్క్.

కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) ఆర్జీ-3, ఏపీఏ ఏరియా ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య విమర్శించారు.

శనివారం ఉదయం 7 గంటల షిఫ్ట్ సమయంలో ALP గని కార్మికులను మ్యానువే వద్ద ఆయన కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కనీసం డ్రిల్ బిట్స్, అవసరమైన పనిముట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతూ పనిచేయాల్సి వస్తోందని తెలిపారు. రక్షణ పరికరాలైన షూస్, గ్లౌస్‌లను సకాలంలో అందించడం లేదని, గనిలో సరిపడా పని ప్రదేశాలను మెరుగుపరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం నాగేల్లి సాంబయ్య మాట్లాడుతూ కార్మికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు విఫలమయ్యాయని అన్నారు. డిస్మిస్ పేరుతో కార్మికులను వేధించడం సరికాదని పేర్కొన్నారు. సీనియర్ కార్మికులు మెడికల్ బోర్డుల కోసం ఎదురుచూస్తున్నారని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిరంతరం అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇసంపల్లి రమేష్, కేంద్ర కమిటీ నాయకులు దేవ శ్రీనివాస్, గట్టు శ్రీనివాస్, గని ఫిట్ సెక్రటరీ వి.వి. గౌడ్, పూసల శేఖర్, పేర్క రమేష్, శ్రీనివాసరెడ్డి, దాసరి మల్లేష్, కొప్పుల సురేష్, పిట్టల సది, సందీప్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!