ePaper
Friday, September 18, 2026
ePaper
Homeజయశంకర్ భూపాలపల్లిఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.

ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు.

📰 Generate e-Paper Clip

జయశంకర్ భూపాలపల్లి.అర్జున్ సమాచారం:

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఆవరణలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌, ఎమ్మెల్యే సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు. ఐడిఓసి కార్యాలయానికి చేరుకున్న చైర్మన్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సంకీర్త్ పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ నిరంజన్‌
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైన, చారిత్రాత్మకమైన రోజన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావడంతో ప్రజా పాలనకు మార్గం సుగమమైందన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తుర్రేబాజ్‌ ఖాన్‌, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు తదితరుల పోరాటాలు, త్యాగాలు తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు.
హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌, ఆంధ్ర మహాసభ, గ్రంథాలయ ఉద్యమం, స్వామి రామానంద తీర్థ తదితరుల కృషి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వాలకు ప్రజల సంక్షేమమే  లక్ష్యమని, ప్రతి పేద కుటుంబానికి కడుపునిండా తిండి, నాణ్యమైన విద్య, సొంత ఇల్లు అందించాల్సిన భాద్యత ఉందని  అన్నారు.  నాటి పోరాట స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

జిల్లాలో 29,683 మంది రైతులకు రూ.299.35 కోట్ల రుణమాఫీ, రైతుభరోసా కింద 1,27,151 మంది రైతులకు రూ.145 కోట్ల పెట్టుబడి సాయం అందించినట్లు తెలిపారు. 21,806 మంది రైతుల నుంచి 12.58 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.298.21 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. 1,123 వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతకు ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం ద్వారా ప్రాధాన్యం ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో జిల్లాలో మహిళలకు రూ.120.03 కోట్ల మేర ఆదా జరిగిందన్నారు. 68,373 మంది లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం వర్తింపజేసి రూ.6.55 కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు.
ధరణి లోపాలను సరిదిద్దేందుకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేశామని,  రీ-సర్వే పనులు  వేగవంతంగా జరుగుతున్నాయని, 22-ఏ నిషేధిత జాబితాలోని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు భూధార్‌ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.  జిల్లాలో 1,39,682 స్మార్ట్‌ రేషన్‌ కార్డులు, 17,301 కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి నెలా 3.96 లక్షల మందికి 2,564 మెట్రిక్‌ టన్నుల ఉచిత సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే 28,298 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేస్తున్నామని ఇందుకోసం రూ.50.86 కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు.

మొదటి విడతలో మంజూరైన 4,586 ఇందిరమ్మ ఇళ్లలో 1,098 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని  తెలిపారు.
తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం స్వచ్ఛ తా హీ సేవా పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో  ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్వో వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, మున్సిపల్7 చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు,  జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!