ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్హైదరాబాద్ బీఆర్కే భవన్ ఎదుట నిరసన పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్ బీఆర్కే భవన్ ఎదుట నిరసన పాల్గోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
దేశంలో పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని మా నేత రాహుల్ గాంధీ  చేసిన హెచ్చరికలు నేడు అక్షరాలా నిజమని తేలాయని ఉప ముఖ్యమంత్రి భత్తి విక్రమార్క అన్నారు.  ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్లను అక్రమంగా తొలగించిన తీరును స్వయంగా ఎన్నికల కమిషనర్లే అంగీకరించడం దేశ ప్రజాస్వామ్యానికే పెను ముప్పని అన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు, టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీఆర్కే భవన్ ఎదుట నిరసన చేపట్టడం జరిగిందని అయన అన్నారు.
తరువాత పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,  మంత్రులు శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ ,మహమ్మద్ అజారుద్దీన్ , ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్నికల కమిషనర్కు వినతిపత్రం అందజేశామని అన్నారు.
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ఓటు హక్కును కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ విభేదాలు పక్కనపెట్టి కలిసిరావాలి. ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని భట్టి అన్నారు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!