ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeతెలంగాణ50వ డివిజన్‌లో కోతుల బెడదకు పరిష్కారం కోరిన కాంగ్రెస్ నాయకులు.విద్యార్థులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా...

50వ డివిజన్‌లో కోతుల బెడదకు పరిష్కారం కోరిన కాంగ్రెస్ నాయకులు.విద్యార్థులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వినతి

📰 Generate e-Paper Clip

50వ డివిజన్‌లో కోతుల బెడదకు పరిష్కారం కోరిన కాంగ్రెస్ నాయకులు.విద్యార్థులు, వృద్ధులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వినతి.

మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 5.

మంచిర్యాల:నగరంలోని 50వ డివిజన్‌లో కోతుల బెడద తీవ్రంగా ఉందని, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వృద్ధులు, స్థానిక ప్రజలు కోతుల దాడులతో భయాందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కమిషనర్, నగర మేయర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.

డివిజన్‌లో కోతుల సంచారం పెరిగిపోవడంతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు కోతులను పట్టేందుకు త్వరలోనే డివిజన్‌లో బోన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా రాబోయే దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. మున్సిపల్  (పారిశుద్ధ్య సిబ్బంది)ని పెంచి, బతుకమ్మలు ఆడుకునే ప్రదేశాలతో పాటు ఇతర ప్రధాన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా అధికారులు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 50వ డివిజన్ ఇన్‌చార్జి గట్టు శ్రవంతి స్వామి, అశ్వత్, ఎండీ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!