ePaper
Friday, October 30, 2026
ePaper
Homeజాతియంయూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి షాక్ మొత్తం 11 స్థానాలకు గాను బీజేపీ 6, ఎస్‌పీ...

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి షాక్ మొత్తం 11 స్థానాలకు గాను బీజేపీ 6, ఎస్‌పీ 5 చోట్ల విజయం గతంతో పోలిస్తే రెండు స్థానాలు అదనంగా గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలకంగా మారిన ఎన్నికలు కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని అఖిలేశ్ యాదవ్ ఆరోపణ

📰 Generate e-Paper Clip

లక్నో,అర్జున్ సమాచారం:
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఐదు నెలల ముందు జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు
చెందిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఐదు స్థానాల్లో గెలిచి అనూహ్యమైన పురోగతి
కనబరిచింది.   అక్టోబర్ 23న బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ జరగ్గా, అక్టోబర్ 27న ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ఒక రోజుకు పైగా కొనసాగింది. మొత్తం 11 స్థానాల్లో ఐదు
పట్టభద్రుల, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 6, ఎస్పీ 3 స్థానాల్లో గెలుపొందగా, రెండు స్థానాలు స్వతంత్రులకు దక్కాయి. తాజా ఫలితాలతో పోలిస్తే
బీజేపీ తన స్థానాలను నిలబెట్టుకోగా, ఎస్‌పీ రెండు సీట్లు అదనంగా గెలుచుకుని తన బలాన్ని పెంచుకుంది.
ఆరోపణలు, రాజకీయ ప్రకంపనలు: కౌంటింగ్ ప్రక్రియ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది.
గోరఖ్‌పూర్-ఫైజాబాద్, వారణాసి వంటి స్థానాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి కేవలం 307 ఓట్ల స్వల్ప తేడాతో గెలవగా, ఓట్ల
తారుమారు జరిగిందని ఒక స్వతంత్ర అభ్యర్థి ఆరోపించారు. ఆగ్రాలో తమ అభ్యర్థిపై దాడి జరిగిందని, ఆయన దుస్తులు చించివేశారని ఆరోపిస్తూ ఎస్‌పీ కార్యకర్తలు వీడియోలను పంచుకున్నారు. ఈ ఫలితాలపై
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. గోరఖ్‌పూర్, వారణాసిలలో అధికార యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. “ఈ ఫలితాలు బీజేపీ పెట్టేబేడా సర్దేశాయి” అని
వ్యాఖ్యానించారు. గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందే వరకు అప్రమత్తంగా ఉండాలని, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించవద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
గెలుపొందిన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు
జరిగిన ఈ ఎన్నికలను ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా భావించాయి. అయితే, ఓటర్లు కేవలం పట్టభద్రులు, ఉపాధ్యాయులు మాత్రమే కావడంతో ఈ ఫలితాలను సాధారణ ఎన్నికలకు పూర్తిగా
అన్వయించలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!