ePaper
Friday, November 13, 2026
ePaper
Homeఎడిటోరియల్అమెరికా టార్గెట్ గా హానీట్రాప్,

అమెరికా టార్గెట్ గా హానీట్రాప్,

📰 Generate e-Paper Clip

అమెరికా టార్గెట్ గా హానీట్రాప్,

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 12.

చిప్‌ తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్‌ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. చైనా గూఢచర్య కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న అలిస్‌ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సంస్థ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రముఖ అమెరికా న్యాయ సంస్థ వాచెల్‌, లిప్టన్‌, రోసెన్‌ అండ్‌ కట్జ్‌ను నియమించింది. మరోవైపు ఉద్యోగులతో జరిగిన అంతర్గత సమావేశంలో తన వ్యక్తిగత తప్పిదాన్ని అంగీకరించి, కుటుంబానికి కలిగించిన బాధకు హువాంగ్‌ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.గతంలో ఓపెన్‌ఏఐ, సేల్స్‌ఫోర్స్ వంటి దిగ్గజాల తరఫున వాదించిన ఈ న్యాయసంస్థ, హువాంగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరపనుంది. ఆర్థిక మోసాలు, క్రిమినల్ కేసులను వాదించడంలో అపార అనుభవం ఉన్న న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ మాజీ అటార్నీ జూన్ కిమ్ ఈ దర్యాప్తునకు నేతృత్వం వహించనున్నారు. గతంలో ఆయన న్యూయార్క్‌ సదరన్‌ డిస్ట్రిక్ట్‌లో తాత్కాలిక ఫెడరల్‌ అటార్నీగా పనిచేశారు. పెద్ద సంస్థలకు సంబంధించిన క్లిష్టమైన న్యాయపరమైన వ్యవహారాలు, దర్యాప్తుల్లో ఈ న్యాయ సంస్థకు అనుభవం ఉంది. 2021లో అప్పటి న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమోపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై జరిగిన విచారణలోనూ కిమ్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హువాంగ్‌ వ్యవహారంలోనూ స్వతంత్రంగా అన్ని అంశాలను పరిశీలించనున్నారు.ఎన్విడియా స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన కమిటీ విచారణను పర్యవేక్షించనుంది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు, సంస్థ రహస్యాలు బయటకు వెళ్లినట్లు ప్రస్తుతం తమ వద్ద ఆధారాలు లేవని ఎన్విడియా ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని బోర్డు సమగ్రంగా పరిశీలిస్తుందని తెలిపింది. ఈ విచారణకు హువాంగ్‌ పూర్తిగా సహకరిస్తారని వెల్లడించింది. ఇదే అంశంపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ కూడా విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా అలిస్ హువాంగ్‌ను విచారించే అవకాశం ఉందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.’ది న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, ఆలిస్ హ్వాంగ్‌ అనే చైనా వ్యాపారవేత్త.. చైనా తరపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని అమెరికా నిఘా అధికారులు అనుమానిస్తున్నారు.ఎన్విడియా సీఈఓ, దాని సహ వ్యవస్థాపకుడైన జెన్సన్ హ్వాంగ్‌‌తో ఆలిస్‌కు సన్నిహిత సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు.హ్వాంగ్‌ తన భార్యకు నమ్మకద్రోహం చేసినట్లు అంగీకరించి, భార్యకు, పిల్లలకు క్షమాపణలు చెప్పారు.ఈ కథనాలపై ఎన్విడియా ఒక స్వతంత్ర దర్యాప్తును ప్రారంభించింది. అయితే, దీనివల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఆ సంస్థ పేర్కొంది.ఈ విషయంపై ఎఫ్‌బీఐ కూడా దర్యాప్తు చేస్తోందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్  తెలిపారు. హ్వంగ్‌తో తాను మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు.గూఢచర్యంలో అమెరికాను టార్గెట్‌గా చేసుకున్న చైనా ఇందుకోసం హ్వాంగ్‌ను పావుగా వాడుకున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి..ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం గూఢచర్యం చేసే ఉద్దేశ్యంతో చైనా అగ్రశ్రేణి గూఢచార సంస్థ ఆలిస్ హ్వాంగ్‌ను నియమించుకుందని అమెరికా అధికారులు భావించారు. ఆమె ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలియదు.ఆలిస్ హ్వాంగ్‌కు జెన్సన్ హ్వాంగ్‌తో ఎలాంటి కుటుంబ సంబంధం లేదు. మార్చి- నవంబర్ 2023 మధ్య ఆమె సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ కంపెనీ మెగాస్పీడ్‌లో ఒక ఉన్నత పదవిని నిర్వహించారు. ఈ సంస్థ చైనాకు ఎన్విడియా చిప్‌ల రవాణాను సులభతరం చేసిందనే అనుమానం ఉండేది. అయితే, ఈ విషయంపై విచారణ జరిపి, ఆ ఆరోపణలు అవాస్తవమని తేలిందని ఎన్విడియా పేర్కొంది.మెగాస్పీడ్‌పై గతంలో వచ్చిన ఆరోపణలపై సింగపూర్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఆ ఆరోపణల ప్రకారం, ఉన్నత శ్రేణి ఎన్విడియా చిప్‌లపై అమెరికా విధించిన ఎగుమతి ఆంక్షలను ఆ కంపెనీ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయంపై వ్యాఖ్య కోసం  మెగాస్పీడ్‌ను సంప్రదించింది.గత నెలలో, ప్రస్తుత నాయకత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిందని, అంతర్గత విచారణ జరిపేందుకు న్యాయ సలహాదారులను నియమించిందని ఆ కంపెనీ ‘ది న్యూయార్క్ టైమ్స్‌’కు తెలిపింది.నిఘా పెట్టినప్పుడు ఆలిస్ హ్వాంగ్‌కు ఒక అమెరికా పౌరుడికి మధ్య సంభాషణలు జరిగినట్లు తేలింది. ‘అన్‌మాస్కింగ్’ అనే ప్రక్రియ ద్వారా పరిశోధించినప్పుడు ఆ వ్యక్తి జెన్సన్ హ్వాంగ్‌ అని గుర్తించారు.అయితే, హ్వాంగ్‌ లే అనే మరో పేరు కూడా ఉన్నా ఆలిస్ హ్వాంగ్‌ ఎలాంటి సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు పంపారు అన్నది స్పష్టంగా తెలియలేదు..అమెరికా గూఢచార అధికారులు లేవనెత్తిన ఆందోళనల గురించి తమ కంపెనీకి తెలుసా అని  అడిగినప్పుడు, తమకు అలాంటి సమాచారం తెలియదని ఎన్విడియా ఖండించింది.”ఒకవేళ మేం ఏదైనా నిజమైన ముప్పును ఎదుర్కొంటున్నట్లయితే, అమెరికా ప్రభుత్వం మాకు తెలియజేసి ఉండేదని భావిస్తున్నాం” అని ఎన్విడియా ప్రతినిధి బీబీసీతో అన్నారు.మరోవైపు ఈ గూఢచర్యం ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. విదేశాంగ శాఖ ప్రతినిధి గ్వో జియాకున్ ఒక మీడియా సమావేశంలో “మేం ఇప్పటికే స్పందించాం. చైనా గూఢచర్యానికి సంబంధించిన ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. ఊహాగానాలపై ఆధారపడినవి. చైనా ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి” అని అన్నారు.ఆలిస్ హ్వంగ్ చైనా కోసం గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ డోనల్డ్ ట్రంప్‌కు గత సంవత్సరమే నిఘా నివేదికలు అందాయని అక్టోబర్ చివరిలో ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం రాసింది.మరోవైపు హ్వాంగ్‌ గురించి అడిగినప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.హ్వాంగ్‌ 1980ల ప్రారంభంలో ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో తన కాబోయే భార్య లారీ మిల్స్‌ను కలిశాడు. ఆ సమయంలో, వారిద్దరూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతూ ఒకే ల్యాబ్‌లో పనిచేసేవారు.వారు ఎన్విడియాను సహ-స్థాపించడానికి సుమారు ఎనిమిది సంవత్సరాల ముందు, 1985లో వివాహం చేసుకున్నారు. వారికి మాడిసన్, స్పెన్సర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.2007లో, వారిద్దరూ జెహెచ్ అండ్ ఎల్ హ్వాంగ్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్విడియా స్టాక్ ధరలో వేగవంతమైన పెరుగుదల కారణంగా, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ ఆస్తులు గణనీయంగా పెరిగాయి. దీని విలువ 9 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అంచనా.ఈ ఫౌండేషన్ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలలోని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లకు మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచ్చింది.హ్వాంగ్‌ ఎప్పుడూ తనను తాను ఒక ఫ్యామిలీ మ్యాన్‌గా చూపించుకునేందుకు ప్రయత్నించేవారని హ్వాంగ్‌ బయోగ్రఫీ రచయిత స్టీఫెన్ విట్  చెప్పారు.”ఆయన తన భార్యను పొగుడుతూ ఆమె గురించి చాలా మంచి విషయాలు చెబుతారు. అయితే ఇలాంటి విషయాలు బయటపడితే ఏ కుటుంబానికైనా తీవ్రమైన బాధ కలుగుతుంది. తనను తాను ఒక కుటుంబ పెద్దగా చూపించుకోవడానికి, తన పిల్లలను తన దగ్గర ఉంచుకోవడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తిపై ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు” అని స్టీఫెన్ విట్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!