రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం:
సిరిసిల్లలో రూ.105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
జిల్లా కలెక్టర్, ఎస్పీసహా ఉన్నతాధికారుల హాజరు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివ్రుద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్ధిక సంఘం నిధులను కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సర్పంచులను బెదిరించి, ఒత్తిడి తెస్తోందన్నారు. అభివ్రుద్ధి పనులకు కేటాయించిన నిధులను కరెంట్ బిల్లులు, జీతాలకు ఎట్లా మళ్లిస్తారు? ఇది నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే కేంద్రానికి లేఖ రాయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తాం అని చెప్పారు. గ్రామ పంచాయతీల కరెంట్ బిల్లులు, సిబ్బంది జీత భత్యాలకు కూడా నిధులివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మండిపడ్డారు.
సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేశ్ బి.గీతే, పలువురు ఉన్నతాధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఆయా అధికారులతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, స్థానిక బీజేపీ నేతలతో కలిసి అమ్రుత్ 2 స్కీం కింద రూ.105 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టిన కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. పక్కనే ఉన్న కార్గిల్ యుద్ద శకటాన్ని సందర్శించారు. కార్గిల్ యుద్దంలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించారు. జై జవాన్, జై కిసాన్ అంటూ నినదించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే:
అమ్రుత్ 2 స్కీం కింద రూ.1.32 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్దరణ, సుందరీకరణ పనులు చేపట్టి ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దుతాం. మురుగునీరు రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు సిరిసిల్ల పట్టణ ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణంలో ఈ చెరువును సందర్శించేలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. లేనిపక్షంలో చర్యలు తప్పవని చెప్పాం. అమ్రుత్ కింద కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తున్నా గడువులోగా పనులు చేయడం లేదు. దీనివల్ల నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముంది. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్ కు చెప్పిన. ఏదో ఒక రాజకీయ నాయకుడిని పట్టుకోవడం, రాష్ట్రమంతా కాంట్రాక్ట్ పని తీసుకోవడం, సరిగా పనులు చేయకుండా నాణ్యత లేకుండా ఇబ్బంది పెట్టడం కొంతమందికి అలవాటుగా మారింది. ఎక్కడా పూర్తి స్థాయిలో పనులు చేయడం లేదు. ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా సిండికేట్ లా మారి ఇబ్బందులు పెడుతున్నారు ఇకపై అట్లా జరగకుండా చూస్తున్నాం.
==============================
అభివ్రుద్ధి కోసం నిధులిస్తే జీతాలకు, కరెంట్ బిల్లులకు మళ్లిస్తారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
RELATED ARTICLES

