ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణసమతామూర్తిని కుటుంబసమేతంగా దర్శించుకున్న త్రిపుర బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్

సమతామూర్తిని కుటుంబసమేతంగా దర్శించుకున్న త్రిపుర బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్

📰 Generate e-Paper Clip

సమతామూర్తిని కుటుంబసమేతంగా దర్శించుకున్న త్రిపుర బీజేపీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్
రంగారెడ్డి, అర్జున్ సమాచారం ప్రతినిధి. జూలై 27.
త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ తన కుటుంబసమేతంగా విచ్చేసి శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో సమతామూర్తి (స్టాట్యూడ్ ఆఫ్ ఈక్వాలిటీ) ని దర్శించుకున్నారు.
భగవద్రామానుజాచార్యుల పవిత్ర దివ్యమూర్తిని కుటుంబంతో సహా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, సమాజంలో సమత, సిద్దాంతాలను పెంపొందించేందుకు రామానుజుల వారి బోధనలు ఎంతో దివ్యమైనవని కొనియాడారు. అనంతరం  శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారిని బిప్లబ్ దేవ్ దంపతులు, కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారు మంగళాశాసనాలు చేసారు ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా జీయర్ స్వామివారి ద్వారా బిప్లబ్ కుమార్ దేవ్ అడిగి తెలుసుకున్నారు.
సమతామూర్తి ప్రాంగణంలోని 108 దివ్యదేశాల ఆలయాలు, ప్రాంగణ విశేషాలను కుటుంబంతో కలిసి తిలకించి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ వ్యాప్తికి చిన్న జీయర్ స్వామివారు చేస్తున్న సేవలకు అభినందనీయమని పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి జగపతిరావు , ఆశ్రమ ప్రతినిధులు మరియు ఇతర ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!