భీమారం పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు రెయిన్ కోట్ల పంపిణీ
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 29:
భీమారం గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల (పంచాయతీ సిబ్బంది) కు బుధవారం సర్పంచ్ విజయలక్ష్మి ఉచితంగా రెయిన్ కోట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, వానలో సైతం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న పంచాయతీ వర్కర్ల ఆరోగ్య దృష్ట్యా ఈ రెయిన్ కోట్లను అందజేసినట్లు తెలిపారు. వర్షంలో తడుస్తూ పనిచేయడం వల్ల వ్యాధుల బారిన పడకుండా, పూర్తి భద్రతతో విధులకు హాజరయ్యేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భీమారం గ్రామ సర్పంచ్ విజయలక్ష్మితో పాటు పంచాయతీ కార్యదర్శి పెద్దపల్లి మల్లేశ్, స్థానిక నాయకులు, ప్రతినిధులు ఉస్కమల్ల చందు, శ్రీనివాస్, కోట రవి, ఆవుల సురేశ్, మార్నేని లచ్చన్న, గుడిమల్ల నరహరి, ప్రణీత్ గౌడ్, దారవేణి రమేశ్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు