ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణతుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడిగా భైర్నెని అశోక్ నియామకం.

తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడిగా భైర్నెని అశోక్ నియామకం.

📰 Generate e-Paper Clip

తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడిగా భైర్నెని అశోక్ నియామకం.

అర్జున్ సమాచారం జులై 30 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

జైపూర్:మండలం నర్వ గ్రామానికి చెందిన భైర్నెని అశోక్‌ను తుడుందెబ్బ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంజి రాజన్న, రాష్ట్ర నాయకులు నియమించారు.
ఈ సందర్భంగా భైర్నెని అశోక్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ, ఆదివాసీ చట్టాల అమలు కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. వీర విప్లవయోధుడు కొమురం భీమ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆదివాసీ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా ఆదివాసీలు ఇంకా తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన పరిస్థితి కొనసాగడం బాధాకరమని పేర్కొన్నారు. ఆదివాసీల సంక్షేమం, భూ హక్కులు, అటవీ హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణకు తుడుందెబ్బ వేదికగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!