ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణనిరుపేద మహిళకు లయన్స్ క్లబ్ చేయూతసేవకు ప్రతిరూపం  లయన్స్ క్లబ్డైరెక్టర్ లయన్ బాబూరావు-క్లబ్ అధ్యక్షురాలు డా....

నిరుపేద మహిళకు లయన్స్ క్లబ్ చేయూతసేవకు ప్రతిరూపం  లయన్స్ క్లబ్డైరెక్టర్ లయన్ బాబూరావు-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య  యాదవ్

📰 Generate e-Paper Clip

నిరుపేద మహిళకు లయన్స్ క్లబ్ చేయూత
సేవకు ప్రతిరూపం  లయన్స్ క్లబ్
డైరెక్టర్ లయన్ బాబూరావు
-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య  యాదవ్


కమాన్ పూపుర( అర్జున్ సమాచారం ప్రతినిధి. ఆగస్టు 1.)


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన నిరుపేద ఒంటరి మహిళ నివసిస్తున్న కిరాయి ఇల్లు కూలిపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ సభ్యులు, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబూరావు  జన్మదినాన్ని పురస్కరించుకుని, బాధిత మహిళకు నిత్యావసర సరుకులను అందజేసి తమ సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య  యాదవ్ మాట్లాడుతూ అంతర్జాతీయ డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ల సేవా కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తూ సేవే పరమావధి అనే భావనతో లక్షలాది మంది లయన్స్ సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన నాయకత్వం, సేవా తపన, నిస్వార్థ అంకితభావం లయన్స్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సమాజ సేవే లయన్స్ ఉద్యమానికి మూల స్ఫూర్తి అని, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి టీవీ సురేష్ బాబు, పాస్ట్ ప్రెసిడెంట్లు మొల్మురి శ్రీనివాస్, మేకల మారుతి యాదవ్, క్లబ్ చైర్పర్సన్లు గంట వెంకటరమణ రెడ్డి, మర్రి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!