ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిపరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆకుల సంజీవరావు

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆకుల సంజీవరావు

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
పరిసరాల పరిశుభ్రత పచ్చదనం,  ప్రతి ఒక్కరి బాధ్యత అని జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆకుల సంజీవరావు పేర్కొన్నారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ ప్రియాంక, గ్రామ సర్పంచ్ పల్లె మాధవి నారాయణతో కలిసి ప్రారంభించి, గ్రామంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలను తమ పిల్లల వలే నాటి, సంరక్షించుకోవాలని కోరారు. పచ్చదనంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వారితో గ్రామ ఉప సర్పంచ్, చొప్పరి శేఖర్ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సూది రెడ్డి ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!